ప్రాంతీయం

ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు. ఇందిరా భవన్ న్యూఢిల్లీలో AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ని మర్యాదపూర్వక కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి

8 Views

ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు. ఇందిరా భవన్ న్యూఢిల్లీలో AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ని మర్యాదపూర్వక కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, బలోపేతంపై చర్చ

బెల్లంపల్లి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలపై ఇరువురు చర్చించారు.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మరియు బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకులు–కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత చేరువ చేయడం వంటి అంశాలపై చర్చించారు.

అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే  దృష్టికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి తీసుకెళ్లి వివరించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంస్థాగత కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలను ఆయన వివరించారు.

బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల అమలు తదితర అంశాలను కూడా ఎమ్మెల్యే  AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కి వివరించారు.

ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ అభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత చేరువ చేయడం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *