కాంగ్రెస్ నాయకులకు ఫ్లెక్సీల పై ఉన్న ప్రేమ అభివృద్ధి పై లేదు – బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్.
మంచిర్యాల.
ఎంపీ గడ్డ వంశీ కృష్ణ, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఫ్లెక్సీల పై ఉన్న ప్రేమ మంచిర్యాల అభివృద్ధిపై లేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ విమర్శించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఎంపీ సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి ఆర్భాటం అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు మంత్రులు హాజరయ్యారని, ఎమ్మెల్యే ఫ్లెక్సీ లకు పోలీస్ రక్షణ కల్పించారని తెలిపారు.





