
ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య గ్రామస్తుల కోసం కాత్యాయని కంటి ఆసుపత్రి సిబ్బందిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహింప చేశారు.నేత్ర వైద్య నిపుణులు నవనీత్ పలువురికి కంటి పరీక్షలు నిర్వహించారు,వారిలో కంటి వైద్యానికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కొంతమంది విద్యార్థులకు కూడా ఉచిత వైద్య పరీక్షలను చేశారు.గ్రామంలో 192 మంది గ్రామస్తులకు ఉచిత కంటి వైద్యాన్ని అందించారు.ఈ వైద్య శిబిరాన్ని మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ప్రారంభించగా ఉపసర్పంచ్ మధుసూదన్ రెడ్డి పాలకవర్గం గ్రామస్తులు కాత్యాయని ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు





