ప్రాంతీయం

తిమ్మాపూర్ గ్రామంలో చెక్కుల పంపిణీ

19 Views

తిమ్మాపూర్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో నలుగురు లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా తిమ్మాపూర్ ఉప సర్పంచ్ జజ్జరి దేవేందర్ మాట్లాడుతూ
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు,సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు,లబ్ధిదారులు
జె.ఉమా 27,500 రూపాయల చెక్కు
పల్లపాటి రవీందర్ రూ.21,500
బొంబోతుల కమల – 24,000
చాట్ల నవ్య – 20,000
మొత్తం రూ.93,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దండు శ్రీనివాస్ , మండల సెక్రటరీ నమిలకొండ సత్యనారాయణ
నమలి కొండ దేవయ్య.కొలకాని శేఖర్, బొంబోతుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని అందుకు వారికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు,

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *