ప్రాంతీయం

గూడెం గోదావరి పుష్కరఘాట్ అభివృద్ధికి శ్రీకారం

7 Views

గూడెం గోదావరి పుష్కరఘాట్ అభివృద్ధికి శ్రీకారం .

మంచిర్యాల నియోజకవర్గం.

దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద పుష్కరఘాట్ పనులకు భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

గూడెం గోదావరి పుష్కరఘాట్‌ను భక్తులకు మరింత సౌకర్యవంతంగా, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను పెంచేలా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనులు చేపడుతున్నారు.

ప్రజల అవసరాలు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని , ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని సంబంధిత అధికారులకు, పోలీస్ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు .

మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, DCP భాస్కర్, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ ఈఓ శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా RTA మెంబర్ అంకతి శ్రీనివాస్, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా RGPRS గడ్డం త్రిమూర్తి, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, లక్షెట్టిపేట్ మండల అధ్యక్షులు నలిమెల రాజు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, జిల్లా నాయకులు పూర్ణచంద్రరావు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *