*మంచిర్యాల జిల్లా*
రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు
సెప్టెంబర్ 1, 2026:
భూ వివాదాల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) వి రాములు అన్నారు. మంగళవారం జిల్లాలోని భీమిని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో కొనసాగుతున్న రీ-సర్వే ప్రక్రియపై మండల తహసిల్దార్, సర్వేయర్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని తంగళ్ళపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. సర్వే చేసిన విస్తీర్ణానికి సంబంధించి కొ-రిలేషన్ స్టేట్‌మెంట్‌ను పూర్తి చేయాలని, రీ-సర్వే పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలోగా ఎలాంటి జాప్యం లేకుండా సర్వే ప్రక్రియ పూర్తి చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారి చే జారీ చేయనైనది*





