
ఘనంగా రాఖీ పండుగ వేడుకలు,రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పండగ సందడి
TS తెలుగు న్యూస్ 24/7: రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పల్లె,పట్టణం అంతా పండగ వాతావరణం నెలకొంది. సోదర సోదరిమణుల ప్రేమకు,సోదరుల రక్షకు బంధానికి నిదర్శనంగా రాఖీ పండుగ నిలిచింది. రాఖీ కట్టించుకోవడానికి సోదరులు,రాఖీ కట్టడానికి సోదరీమణులు ఉద్యోగ,ఉపాధి,చదువుల నిమిత్తం దూరంగా ఉన్నవారు పడక్కి ఒక్క చోట చేరి సంతోషకరమైన వాతావరణంలో పండగ జరుపుకున్నారు.సోదరీమణులు రాఖీ కట్టి స్వీట్లు తినిపించగా సోదరులు సోదరిమణుల కాళ్ళు మొక్కి ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకోవడంతో ఆ సోదరసోదరిమణుల కలయిక ప్రేమ ఆదరాభిమానాలను చూసిన వారిని కన్న తల్లిదండ్రుల కళ్ళల్లో సైతం ఆనందం నిండుకునే పండుగ పేద,ధనిక,తేడా లేకుండా వేల కట్టలేని ప్రేమ ఆప్యాయతల మధ్య రాఖీ పండగ రాష్ట్ర వ్యాప్తంగా సోదరసోదరిమణులు ఘనంగా నిర్వహించుకున్నారు.





