జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరీమ అగ్రవాల్ సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని దొమ్మట గ్రామ పంచాయతీని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి డ్రై డే చేయాలని, ఫాయింగ్ చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. లింగరాజుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేసుకునేలా లబ్ధిదారులను మోటివేట్ చేయాలని అధికారులకు సూచించారు. దౌల్తాబాద్ కస్తూర్బా హాస్టల్ ను సందర్శించి విద్యార్థులతో కలిసి కూర్చుని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని పిల్లలని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ఆహారం అందించకుంటే చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను హెచ్చరించారు. అనంతరం దౌలతాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ఓపి రిజిస్టర్ ను పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురైన తక్షణమే స్పందించి వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లింగస్వామి, ఏంపిడివో, తాసిల్దార్, యంఈవో, యంపివో తదితరులు పాల్గొన్నారు.





