
ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియామకం అయిన గుల్లపల్లి శ్రీకాంత్ రెడ్డి కి సన్మానం
TS తెలుగు న్యూస్ 24/7:ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియామకం అయిన గుల్లపల్లి శ్రీకాంత్ రెడ్డినీ గురువారం పదిర గ్రామ కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా గుల్లపల్లి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నాకు కల్పించిన ఈ పదవికి న్యాయం చేస్తానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పదిర గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూర్తి వెంకటేష్,డైరెక్టర్ గుల్లపల్లి లక్ష్మారెడ్డి,జిల్లా నాయకులు కంచర్ల రాజు,కుంభాల వెంకట్ రెడ్డి,దమ్మ లక్ష్మారెడ్డి,అలవాల కర్ణ,ఎదునూరి బాలరాజు,మూర్తి వేణు,నరేష్,గట్టు రాజు,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.





