ప్రాంతీయం

పోచమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు

6 Views

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ లో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.

ఈసందర్భంగా సురేఖ మాట్లాడుతూ పోచమ్మ తల్లి ఆశీస్సులతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

ఆలయ అభివృద్ధి కోసం సహకరించి, అన్నదాన సదుపాయం కల్పించిన మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు – సురేఖ పుణ్య దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం సురేఖమ్మ ని స్థానిక కార్పొరేటర్ బండారి సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, టీపీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇంఛార్జి నూకల రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *