ప్రాంతీయం

రైతులు సెప్టెంబర్ 10 తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి ..

50 Views

సిద్దిపేట్  మార్కుక్, ఆగస్టు 22, తెలుగు న్యూస్ 24/7

మార్కుక్, ఆగస్టు 22: ప్రభుత్వం సూచించిన ఏడు రకాల అనగా BPT5204,RNR15048,HMTSona, WGL44(సిద్ది ), KNM1638,KNM7715 జైశ్రీరామ్ సన్నా రకాలు వరి సాగు చేసే రైతులు సెప్టెంబర్ 10 తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మార్కుక్ మండల వ్యవసాయ అధికారి రాము కోరారు.డీలర్ వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, విత్తనాల కొనుగోలు వివరాలతో సంబంధిత డీలర్ వద్ద ఆన్లైన్లో నమోదు, చేయించుకోగలరు అలాగే ఇతర జిల్లాలు తోటి రైతులు కౌలు రైతుల వివరాలను స్వయదృవీకరణ పత్రం ద్వారా సంబంధిత ఏఈఓలను సంప్రదించి పంట వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.ఇతర రైతుల నుంచి పొందిన విత్తనాలను వినియోగించే రైతులు కూడా తప్పనిసరిగా పంట వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్నాల వరి రకాలనే సాగు చేసి, ఆ పంట వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన బోనస్ వర్తిస్తుందని పేర్కొన్నారు.రైతులు తమ పంట వివరాలను సకాలంలో నమోదు చేసుకుని ప్రభుత్వం అందించే బోనస్‌ను పొందాలని మార్కుక్ మండల వ్యవసాయ అధికారి రాము సూచించారు. రైతులకు మరింత సమాచారం కోసం తమ గ్రామంలోని ఏఈఓలను సంప్రదించాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *