మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు.
మంచిర్యాల.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 22A నిషేధిత భూముల జాబితా లో జరిగిన అక్రమాలు, తప్పిదాల పై సమగ్ర విచారణ జరిపించాలని అదే విధంగా 22 GO లో తప్పిదం జరిగిందని ఒప్పుకున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి , బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మరియు బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ కి మెమోరాండం అందించడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో రఘునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం లో ప్రజల సమస్యల పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్న బీజేపీ నాయకులను అడ్డుకోవడం సమంజసం కాదని రఘునాథ్ అన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటుకు కట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుతంగా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడానికి వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ GO ల పేరిట పేద మధ్య తరగతి ప్రజల భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అంటేనే దోపిడీ పార్టీ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 22 GO లో అనేక తప్పిదాలు ఉన్నాయని స్వయంగా రాష్ట్ర మంత్రులు ఒప్పుకున్నారని అన్నారు. 22 Go లో జరిగిన తప్పిదాలకు, జరిగిన అక్రమాల పై వెంటనే విచారణ జరిపించి బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణ మూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పట్టి వెంకట కృష్ణ, రమణ రావు, కమలాకర్ రావు, ఆకుల అశోక వర్ధన్, ఆడే ప్రేమ్ సింగ్, పచ్చ సప్న రాణి, బొడ్డు రఘునందన్, అమిరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, కస్తూరి నాగరాజు, బోట్ల సత్యం, బింగి ప్రవీణ్, నల్ల రవి, మద్ది సుమన్, రాకేష్ రెన్వ, సల్ల సాయి కిరణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.





