28 Views
ముస్తాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రప్రభ): ఇటీవల పాఠశాలలో ఉపాధ్యాయిని రూపారెడ్డి హత్యకు గురైన ఘటనను ఖండిస్తూ ముస్తాబాద్ మండలంలోని పలు ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, ప్రిన్సిపాల్ లు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక రహదారి వెంబడి ర్యాలీ
తీసి టీచర్లపై దాడులను అరికట్టాలి ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. విద్యాలయాల్లో ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found




