ప్రాంతీయం

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక..

13 Views

సిద్దిపేట్ ఆగస్టు 20, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యాయి. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్  ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, ఎన్నికల నోడల్ అధికారి గజ్వేల్ ఏసిపి నరసింహులు,  ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు ఇన్స్పెక్టర్ కిరణ్, చేర్యాల సీఐ రమేష్, ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ తిరుపతి, పర్యవేక్షణలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడింది.ఈ సందర్భంగా సిపి ఎన్నికల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నోడల్ అధికారికి, ఎన్నికల నిర్వహణ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ఎన్నికల్లో కమిషనరేట్ పరిధిలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.నూతన కార్యవర్గ వివరాలు:ఈ ఎన్నికల్లో కానిస్టేబుల్ చిందం సుభాష్,(బేగంపేట పోలీస్ స్టేషన్) సిద్దిపేట కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మల్లేష్ గౌడ్ (పిసిఆర్ ఇన్స్పెక్టర్) అభిలాష్ (కోహెడ ఎస్ఐ), ప్రధాన కార్యదర్శిగా సాయి చరణ్ (ఆర్ఎస్ఐ), సంయుక్త కార్యదర్శిగా రవి కుమార్ (సివిల్ కానిస్టేబుల్) కార్యనిర్వహణ కార్యదర్శిగా గంపల సతీష్(చేర్యాల కానిస్టేబుల్), కోశాధికారిగా తిరుపతి ( కోహెడ కానిస్టేబుల్) ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక సభ్యులుగా బి. రాజు , డి. శ్రీనివాస్, టి. యాదగిరి, తార ( హెడ్ కానిస్టేబుల్) , బి. శ్రీనివాస్ (ఏఆర్పిసి), పి. శాంభవి (ఏఆర్పిసి) ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గానికి సీపీ, మరియు ఇతర ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *