మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం.
*గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల దృశ్య ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి*
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు నేపథ్యంలో చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు.
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు అని తెలిపారు.
గ్రామాలలో పాత ఇండ్లు, గుడిసెలు, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, వాగుల వంకలు పొంగే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పోలీసులు, రెవెన్యూ, మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ క్షేత్రంలో పనులకు వెళ్ళినప్పుడు విష సర్పాలు తో జాగ్రత్త వుండాలని, కాలనీలలో కరెంటు స్తంభాలను తాకవద్దు అని తెలిపారు.
