ప్రాంతీయం

పురుగుల మందు తాగి  వ్యక్తి మృతి..

63 Views

సిద్దిపేట్ జిల్లా,మర్కుక్, ఆగస్టు 16, తెలుగు న్యూస్ 24/7

మార్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పురుగుల మందు తాగి  వ్యక్తి మృతి. ఆదివారం అనగా 16-08-2026 తేదీన మార్కుక్ పోలీస్ స్టేషన్‌కు బొమ్మ పోచయ్య, తండ్రి శ్రీశైలం, వయస్సు 20 సంవత్సరాలు, కులం: కుర్మ, వృత్తి: వ్యవసాయం, దరఖాస్తు అందజేశారు.దరఖాస్తులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఫిర్యాదిదారు తండ్రి బొమ్మ పోచయ్య, వయస్సు 42 సంవత్సరాలు, కులం: కుర్మ, వృత్తి: వ్యవసాయం. గత రెండు సంవత్సరాల కాలంలో తన ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేయడంతో సుమారు రూ.6 లక్షల అప్పు అయినట్లు, ఆ అప్పును ఎలా తీర్చాలో అనే ఆందోళనతో ఉండేవాడని తెలిపారు.అదేవిధంగా, కొద్ది రోజులుగా అతని భార్య లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుండటంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించగా వైద్య ఖర్చులు పెరిగి అప్పులు మరింత పెరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో 15-08-2026 తేదీన ఉదయం సుమారు 11:00 గంటలకు గుర్తు తెలియని పురుగుమందు సేవించాడు.అనంతరం కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి ప్రజ్ఞాపూర్‌లోని అతిథి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం లోటస్ క్యూర్ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు 16-08-2026 ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం( ఆర్ వి ఎం ) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనపై మార్కుక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, సంఘటనకు గల కారణాలు మరియు ఇతర అంశాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టడం జరుగుతోంది.

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *