పరుగే ప్రాణానికి బలం ఆరోగ్యమే నిజమైన సంపద.-రన్ ఫర్ హెల్త్ రన్ ఫర్ ఇండియా,స్వాతంత్ర దినోత్సవమున ఫిట్ నెస్ 10కె రన్
సిద్దిపేట,మర్కుక్, ఆగస్టు 15, తెలుగు న్యూస్ 24/7
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు, “ఆరోగ్యమే మహాభాగ్యం,రోజూ వ్యాయామం చేయండి,ఆరోగ్యంగా జీవించండి”అనే సందేశంతో మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సేవాఫౌండేషన్ చైర్మెన్ తాండ బాలకృష్ణ గౌడ్, మరియు మిత్రుడు రత్నాకర్ తో పాటు10 కిలోమీటర్ల పరుగు పూర్తి చేశారు.వారి రన్నింగ్ ను చూసి అటుగా వెళుతున్న మక్త గ్రామనికి చెందిన పద్మా రెడ్డి రన్నర్స్ కు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోవడంతో మధుమేహం, రక్తపోటు,గుండె సంబంధిత వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని,రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక,జాగింగ్ లేదా రన్నింగ్ వంటి వ్యాయామం చేస్తే శరీరం దృఢంగా ఉండటమే కాకుండా,మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు.యువతతో పాటు అన్ని వయస్సుల వారు వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని,ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.





