ప్రాంతీయం

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే స్వేచ్ఛ…

25 Views
ముస్తాబాద్, ఆగస్టు15 (24/7న్యూస్ ప్రతినిధి): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహంవద్ద స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని సమస్త బిఆర్ ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొంపల్లి సురేందర్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ

కార్యక్రమంలో తాజా మాజీ పలు పదవులు నిర్వహిస్తున్న బిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులు, కార్యకర్తలు ఘనంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *