మంచిర్యాల జిల్లా.
రేపు మంచిర్యాలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు పలువురు మంత్రులు వస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవారం మంచిర్యాల కు వస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆదివారం తన నివాస గృహఁలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబెడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. అలాగే రాళ్ళవాగు పక్కన కరకట్ట నిర్మాణం కు శంఖుస్థాపన తో పాటు పలు పథకాలకు శ్రీకారం చూడతారని తెలిపారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలిస్తారని చెప్పారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్ లో వాటర్ ట్యాన్క్ , జగదాంబ సెంటర్, మెయిన్ రోడ్, అర్చన చౌరస్తా మీదుగా బహిరంగ సభ స్థలం వరకు ర్యాలీ కొనసాగుతుందని అన్నారు. సభలో కొత్త పథకాలను మంత్రులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మండుటెండలో 40 వేల మంది అభిమానులు సభకు హాజరవుతారని తెలిపారు. క్రమ శిక్షణ కార్యకర్తలు పార్టీకి బలమన్నారు. 85 శాతం మంది రైతులకు రుణమాఫీ జరిగిందని, సన్న బియ్యంకు బోనస్, ఉచిత బస్సుప్రయాణం, ఉచితంగా రెండు వందల యూనిట్ల విద్యుత్ , ఉచితంగా బియ్యం పంపిణీ తో ప్రజలకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చమన్నారు. గత టీఆరెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఆర్ధికంగా సతమతమవుతుందన్నారు. డంప్ యార్డు సమస్యకు పరిష్కారం లభిస్తుందని భరోసా ఇచ్చారు. వేంపల్లి లో ఇండస్త్రీయల్ పార్కు కోసం బలవంతంగా భూములు లాక్కోవడం లేదని వివరించారు. మహాప్రస్థానం మంగళవారం నుంచి వినియోగంలోకి వస్తుందని నిరుపేదలకు ఉచితంగా అంత్యక్రియలు జరిగేందుకు వెసులుబాటు ఇస్తున్నామని తెలిపారు. అక్కడే డెత్ సర్టిఫికెట్ ఇస్తారని అన్నారు. తాను చేసే అభివృద్ధి పథకాలను వక్రీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.





