ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: మండల అధ్యక్షులు గజ్జెల రాజు

98 Views

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: ముస్తాబాద్ మండల అధ్యక్షులు గజ్జెలరాజు

TS 24/7: తెలుగు న్యూస్: కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షునిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన గజ్జెల రాజు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి,రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,లను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేలా చేస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానని అన్నారు.కేవలం యువకులను ప్రోత్సహించేది కాంగ్రెస్ పార్టీ నేనని ఈ నియామకంతో మరొకసారి రుజువు చేశారు అని పార్టీ పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వారితోపాటు ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి, నామాపూర్ గ్రామ సర్పంచ్ మాదాస్ అనిల్,ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు తాళ్ల విజయ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరుట్ల మహేష్ రెడ్డి,రంజాని నరేష్, ఎన్ఎస్ యుఐ నాయకులు మిడిదొడ్డి భాను కుమార్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోవర్ధన్ నాయక్,వెంకటరావుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు రాజిరెడ్డి,సోషల్ మీడియా ఇంచార్జ్ పోతారం వంశీ గౌడ్ కలరు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *