సిద్దిపేట జిల్లా, వర్గల్, ఆగస్టు 8 తెలుగు న్యూస్ 24/7
వర్గల్ బస్టాప్‌లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాప్ ప్రాంగణం కార్లు, లారీల పార్కింగ్‌కు మాత్రమే పరిమితమైనా అధికారులు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. బస్సులు రోడ్డుపైనే ఆగుతుండటంతో నిత్యం అవస్థలు పడుతున్నామని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.





