సిద్దిపేట జిల్లా వర్గల్, ఆగస్టు 8, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదర్‌పల్లిలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం నిరుపయోగంగా మారింది. పిల్లలు ఆడుకునేందుకు కేటాయించిన స్థలంలో ఆట వస్తువులు కనుమరుగై, పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు దర్శనమిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రాంగణం అధ్వానంగా తయారైందని రైతులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రౌండ్‌ను బాగుచేయాలని కోరుతున్నారు.





