రామగుండం పోలీస్ కమిషనరేట్
విద్యార్థులకు సైబర్ మోసాలు,పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు,నకిలీ ఐపీవోలు,నకిలీ ట్రేడింగ్ యాప్‌లపై అవగాహన
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ ఎలిగేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలిగేడు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “సురక్ష కా తిరంగా” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ మధుకర్ మాట్లాడుతూ పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు,నకిలీ ఐపీవోలు,నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు తదితర సైబర్ నేరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్,సందేశాలు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలు,బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు,పాస్‌వర్డ్‌లు వంటి గోప్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
అనంతరం సీసీ కెమెరాల ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.నేరాల నియంత్రణ,ప్రజల భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.





