ముస్తాబాద్ ఆగస్టు 7 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని బాలుర సంక్షేమ హాస్టల్‌ను మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి మరియు వార్డ్ మెంబర్లు తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్, రంజాన్ నరేష్ తనిఖీ చేశారు. అనంతరం భోజన వసతులు, పరిశుభ్రత గురించి ఆరా తీసి, పిల్లలతో కలిసి భోజనం చేశారు. వంటచేసే
వారికి నాణ్యమైన ఆహారం వండాలని, యజమాన్యం వర్షాకాలంలో దోమలు, జ్వరాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం, పలువురు హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.




