ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బట్టల వ్యాపారి పోతు ఆనందం (49 ) అనారోగ్యంతో శనివారం మరణించాడు,
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పోతు ఆనందం
అనే బట్టల వ్యాపారి గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యాంతో బాధపడుతున్నాడు. గత వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కాగా అతని కుటుంబ సభ్యులు ఖరీదైన వైద్యం కోసం హైదరాబాదులోనీ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు , చికిత్స పొందుతుండగా శనివారం రోజు ఉదయం మృతి చెందాడు. ఇప్పటి వరకు సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అయినా ప్రాణందక్కలేదని కుటుంబసభ్యులు బోరునవిలపించారు. మృతునికి తల్లి లక్ష్మీ ,తండ్రి అంజనేయులు , భార్య సుజాత కుమారులు వినయ్ (29 ) గౌతమ్ (25 ) లు ఉన్నారు. మృతుడు గత నలభై సంవత్సరాలుగా బట్టల వ్యాపారిగా కొనసాగుతూ, అకస్మాత్తుగా అనారోగ్యనికి గురై మృతి చెందడంతో ఎల్లారెడ్డి పేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆనందం మృతి పట్ల టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య ,ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ,టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రసిడెంట్ బండారి బాల్ రెడ్డి లు ఎల్లారెడ్డిపేట బట్టల దుకాణాల , వ్యాపార వర్తక సంఘ యజమానులు ఆయన కుటుంబానికి సంతాపాన్నీ ప్రకటించారు




