
జడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపేటలో వైభవంగా ఆచార్య జయశంకర్ జయంతి ఉత్సవాలు
*జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ఎల్లారెడ్డిపేటలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తిరుమల మనోహరచారి గారు ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి గాలిపెల్లి కృష్ణ హరి గారు ఉపాధ్యాయులు అజ్మీర భీక్కు నాయక్ అంజన్ రెడ్డి న్యాత రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలలో పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, జయశంకర్ సార్ గారి జీవిత చరిత్ర, తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర మరియు సాధించిన విజయాలను తమ వ్యాసాలు, చిత్రాల ద్వారా అద్భుతంగా ప్రదర్శించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ… “తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్. వారి ఆశయాలను, ఆలోచనలను విద్యార్థులు మార్గదర్శకంగా తీసుకోవాలి” అని పిలుపునిచ్చారు.
అనంతరం పోటీలలో విజేతలుగా నిలిచిన వ్యాసరచన పోటీలు మొదటి బహుమతి పి దివ్య జ్యోతి 9వ తరగతి రెండో బహుమతి జి శృతి పదవ తరగతి చిత్రలేఖనంలో భవిష్య ప్రథమ బహుమతి ఎం లతిక ద్వితీయ బహుమతి సీనియర్ ప్రథమ బహుమతి ఎం హరీష్ విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్వామి శైలజ శంకర్ శ్రీనివాస్ రెడ్డి వేణుగోపాలరావు డి శ్రీనివాస మధుసూదన్ శ్రీకాంత్ రాజు శ్రీ శైలావతి ఎస్ శ్రీనివాస్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.





