రామగుండం పోలీస్ కమీషనరేట్.
బదిలీ పై వెళ్తున్న ఏసీపీ రాఘవేంద్ర రావు, ఇన్స్పెక్టర్ ప్రేమ్ లకు ఘన వీడ్కోలు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఏసీపీ గా సేవలందించిన ఏసీపీ రాఘవేంద్ర రావు ఇటీవల ఏసీపీ, SR నగర్, హైదరాబాద్ సిటీ, ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, కొమురం భీమ్,ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సీపీ పోలీసు కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించి రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఏసీపీ రాఘవేంద్ర రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ కి శాలువా కప్పి, మెమెంటో అందిస్తూ విధుల పట్ల వారి యొక్క అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో వారు నిర్వర్తించిన విధులను సీపీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపి అడ్మిన్ సి. రాజు, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.





