భారీ వర్షాల ప్రభావితం వల్ల కులిపోయిన బ్రిడ్జిలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల నియోజకవర్గం.
దండేపల్లి మండల మాకులపేట గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి కూలిపోయిన బ్రిడ్జిని మరియు కొర్విచెల్మ గ్రామంలో కూలిపోయిన బ్రిడ్జిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న వంతెనలను త్వరితరంగా పునరుద్ధరించేలా చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, RGPRS జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి , సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





