ప్రాంతీయం

డ్యూటీతో పాటు మానవత్వం, బాధ్యత చాటిన కమీషనరేట్ పోలీసులు

23 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*డ్యూటీతో పాటు మానవత్వం, బాధ్యత చాటిన కమీషనరేట్ పోలీసులు*

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలీసులు మానవత్వం చాటారు. పోలింగ్ కేంద్రాలకు వోటు వేయడానికి వచ్చిన వృద్ధులు నడవడానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించిన పోలీసులు వెంటనే సహాయం చేశారు. అందుగులపేట స్కూల్ లో ఏ ఎస్ ఐ మల్లేష్, తుర్కపల్లి గ్రామం లో విశ్వనాథ్, సిర్స లో స్పెషల్ పార్టీ కాన్స్టేబుల్ నీతిన్ వీల్‌చెయిర్, స్ట్రెచర్ లేదా భుజాన ఎక్కించి పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి వృద్ధులు తమ ఓటు హక్కును వేయడానికి సహాయపడ్డారు. పోలీసుల మానవీయ చర్యను స్థానిక ప్రజలు అభినందించారు. పోలీసులు డ్యూటీతో పాటు మానవత్వాన్ని కూడా పాటించడం ఎంతో ప్రశంసనీయం అని అధికారులు తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా జరగాలన్న ఉద్దేశంతో ప్రతి పోలీస్ సిబ్బంది కృషి చేస్తున్నారు. సెల్యూట్ రామగుండం కమీషనరేట్ పోలీస్.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *