ప్రాంతీయం

ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

17 Views

*మంచిర్యాల జిల్లా*

ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

జూలై 30, 2026:
జిల్లాలోని రేషన్ కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్–2026 నెలలకు సంబంధించిన 3 నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అక్కడక్కడా సర్వర్ సంబంధిత సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ, ఈ-పాస్ ఇంజనీర్లు వాటిని వెంటనే పరిష్కరించి పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని, జిల్లాలో సన్నబియ్యం నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నందున ప్రతి అర్హులైన రేషన్ కార్డుదారునికి సన్నబియ్యం తప్పనిసరిగా అందించడం జరుగుతుందని తెలిపారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగుతుందని, రేషన్ కార్డుదారులు తొందరపడకుండా, తమకు అనుకూలమైన సమయంలో సంబంధిత రేషన్ దుకాణానికి వెళ్లి సన్నబియ్యాన్ని తీసుకోవచ్చని తెలిపారు. పంపిణీ కార్యక్రమాన్ని మండల స్థాయిలో సంబంధిత మండల తహసీల్దార్లు, జిల్లా స్థాయిలో జిల్లా పౌర సరఫరాల అధికారి నిరంతరం పర్యవేక్షిస్తారని, జిల్లాలో ప్రస్తుతం 2 లక్షల 57 వేల 251 రేషన్ కార్డులు ఉన్నాయని, అర్హులైన ప్రతి కార్డుదారునికి 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని రేషన్ దుకాణాల డీలర్లు, రేషన్ కార్డుదారులు అక్రమంగా పక్కదారి మళ్లించి విక్రయించినట్లయితే తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ (నియంత్రణ) ఆర్డర్–2016లోని సెక్షన్ 17(డి) ప్రకారం సంబంధిత రేషన్ డీలర్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయబడుతుందని, రేషన్ కార్డుదారులు రేషన్ బియ్యాన్ని విక్రయించినట్లయితే వారి రేషన్ కార్డు రద్దు చేయడంతో పాటు వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *