మంచిర్యాల జిల్లా, నస్పూర్.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆయుష్ యోగ నస్పూర్ నందు మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. మహిళలను అన్నిట్లో ముందు ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం, ఈ సంవత్సరం ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యోగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మజా, మరియు డిపిఎం ప్రోగ్రాం రవీందర్ నాయక్, ఆయుష్ యోగా టీచర్ సుధాకర్, మేఘన, శైలజ, ప్రదీప్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.





