లక్ష్మి టాకీస్ – రాజీవ్ నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వెంటనే నిర్మించాలి- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
మంచిర్యాల
ఈరోజు నిర్వహించిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ సెంట్రల్ జోన్ కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మంచిర్యల కార్పొరేషన్ కు అనేక హామీలు ఇచ్చి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. మంచిర్యాల MLA గెలిచిన నెల రోజుల్లో లక్ష్మి టాకీస్ – రాజీవ్ నగర్ ఫ్లై ఓవర్ నిర్మిస్తామని హామీ ఇచ్చి గెలిచి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు పనులు ప్రారంభించ లేదని అన్నారు. లక్ష్మి టాకీస్ – రాజీవ్ నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించక పోవడం వలన టు టౌన్ ప్రాంత ప్రజలకు నిత్యం రాకపోకలకు తీవ్ర రవాణా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వెంటనే ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు ప్రారంభించాలని డిమాండ్ చేసారు. అదే విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో గాజుల ముఖేష్ గౌడ్, రంగ శ్రీశైలం, గోపతి రాజయ్య, బోట్ల అనిత, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, వైద్య శ్రీధర్, బోయిని హరికృష్ణ, బెల్లంకొండ మురళి, తరుణ్ సింగ్ మరియు తతిదరులు పాల్గొన్నారు.





