కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయిన మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ.
న్యూఢిల్లీ:
తాడిచర్ల బ్లాక్-2కు పర్యావరణ అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి,RKP మైన్స్‌కు కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరిన మంత్రి వివేక్ వెంకటస్వామి,తాడిచర్ల బ్లాక్-2 ప్రారంభమైతే 1,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి – ఎంపీ గడ్డం వంశీకృష్ణ.
కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు కేటాయించిన తాడిచర్ల బ్లాక్-2 ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులను అత్యవసరంగా మంజూరు చేయాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే స్థానిక యువతకు 1,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ వివరించారు.అలాగే, RKP మైన్స్‌కు కూడా పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను విజ్ఞప్తి చేశారు.
ఈ అంశాలపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.





