దొంగతనానికి పాల్పడిన నిందితులు అరెస్ట్..
మర్కుక్, జులై 26, తెలుగు న్యూస్ 24/7
మార్కుక్ పోలీస్ స్టేషన్,సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మార్కుక్ పోలీస్ స్టేషన్ పోలీసులు వాహనాల తనిఖీల సందర్భంగా ఇద్దరు నేరస్థులను పట్టుకొని, రెండు దొంగతనం కేసులను ఛేదించి మొత్తం 5 ఎలక్ట్రిక్ మోటార్ పంపులను మరియు నేరానికి ఉపయోగించిన అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనం (TG19T0378)ను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టు అయిన నిందితులు:తాటికొండ రమేష్ @ స్వామి,డప్పు యాదగిరిఛేదించిన కేసులు:1) మార్కుక్ PS Cr.No.87/2026, U/S 303(2) BNS మార్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మోటార్ పంపుల దొంగతనం కేసులో నిందితులు 2 ఎలక్ట్రిక్ మోటార్ పంపులను దొంగిలించినట్లు విచారణలో తేలింది. నిందితుల వద్ద నుండి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 58,000 రూపాయలు ఉంటుంది2) మార్కుక్ PS Cr.No.88/2026, U/S 303(2) BNS దామరకుంట గ్రామ శివారులో 23/24-07-2026 రాత్రి ముగ్గురు రైతులకు చెందిన 3 ఎలక్ట్రిక్ మోటార్ పంపులను, మొత్తం రూ.72,000/- విలువైన ఆస్తిని దొంగిలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ కేసులో దొంగిలించిన మూడు ఎలక్ట్రిక్ మోటార్ పంపులను కూడా పోలీసులుస్వాధీనంచేసుకున్నారు.స్వాధీనం చేసిన ఆస్తి:5 ఎలక్ట్రిక్ మోటార్ పంపులుఅశోక్ లేలాండ్ గూడ్స్ వాహనం (TG19T0378)రూ.2,000/- నగదుఒక ఆక్సో బ్లేడ్,విచారణలో ప్రధాన నిందితుడు తాటికొండ రమేష్ అలియాస్ స్వామి పలు ఆస్తి నేరాలలో పాల్పడిన అలవాటైన నేరస్థుడిగా గుర్తించారు. నిందితులను రిమాండ్ కు తరలించనైనది.





