మంచిర్యాల జిల్లా
*ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన 420 కాంగ్రెస్ పార్టీ – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి *
*నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మరియు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బీజేపీ నాయకుల పై చేసిన ఆరోపణలు ఖండిస్తూ ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. కిషన్ రెడ్డి ని విమర్శించే అర్హత రేవంత్ రెడ్డి కి లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కిషన రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట పడితే అప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సైమైక్య ఆంధ్రకు మద్దతు తెలిపి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూసిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కిషన్ రెడ్డి ఒక్క చిన్న స్థాయి కార్యకర్త నుండి అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజల్లో మమేకమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కేంద్ర మంత్రిగా ఎదిగిన నాయకుడు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా మహిళలకు 2500 రూపాయలు, వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్, రైతులకు 15 వేల రూపాయల రైతు భరోసా, నిరుద్యోగ భృతి అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మరొకవైపు మన మంచిర్యాల ఎమ్మెల్యే కు మతి భ్రమించి బీజేపీ నాయకులు పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత BRS ప్రభుత్వంలో రైతుల సమస్యల మీద పోరాడినా ఏకైక పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే అని అన్నారు. గత ప్రభుత్వంలో వడ్ల కొనుగోలులో 5-7 కిలోలు కట్టింగ్ పెడితే రైతుల తరపున బీజేపీ పార్టీ పోరాడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర వహించింది అని అన్నారు. ప్రతి 6 నెలలకు వరి ధాన్యం కొనుగోలు సమయంలో ప్రతి మండలంలో కొనుగోలు కేంద్రాలు సందర్శించి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. బీజేపీ నాయులకు పై మరొకసారి విమర్శలకు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సన్నం వడ్లకు మాత్రమే బోనస్. ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అదే విధంగా ప్రతి ఒక్క రైతులు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, దుర్గం అశోక్, పత్తి వెంకట కృష్ణ, ఆకుల అశోక్ వర్ధన్, ఎనగందుల కృష్ణ మూర్తి, వెంకట రమణ రావు, జోగుల శ్రీదేవి, శ్రీకృష్ణ దేవరాయలు, రాచర్ల సంతోష్, అక్కల రమేష్, అశ్విన్, బింగి ప్రవీణ్, మోటపలుకుల గురవయ్య, వంగపల్లి వెంకటేశ్వర రావు, అశ్విన్, సత్రం రమేష్, ధార కల్యాణి, బుడిమే విజయ్, బేర రామన్న, శైలేంద్ర సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు.





