Breaking News

రామయ్య తలంబ్రాలు పంపిణి చేసిన రామకోటి రామరాజు

18 Views

● చీర్ హనుమాన్ దేవాలయంలో తలంబ్రాల పంపిణి

● రామయ్య తలంబ్రాలు అందుకోవడం అదృష్టమన్న భక్తులు

గజ్వేల్ నియోజకవర్గం జూలై 17 (ప్రజా ప్రతిభ):

భద్రాచల రామయ్య కల్యాణ ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణి చేస్తూ ఆషాడశుద్ధ తదియ శుక్రవారం నాడు నిజామాబాద్ జిల్లా బొబ్బిలి వీధిలోని చీర్ హనుమాన్ దేవాలయంలో శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్వర్యంలో తలంబ్రాల పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ రామయ్య కళ్యానానికి ఈ సంవత్సరం 300కిలోలు గోటి తలంబ్రాలు అందచామని తెలిపారు. నిజామాబాద్ నుండి పెద్ద ఎత్తున 4వ సారి గోటి తలంబ్రాలు ఓలిచి అందించారని తెలిపారు. తిరిగి భద్రాచలం నుండి 100కిలోల ముత్యాల తలంబ్రాలు భక్తుల కోసం తీసుకొచ్చానని తెలిపారు. తలంబ్రాలు అందుకోవడం ఆనందంగా ఉందని మేము భద్రాచలం వెళ్ళలేకున్న మా గోటి తలంబ్రాలు వెళ్లాయి, ఇప్పుడు ముత్యాల తలంబ్రాలు తిరిగి ఆదుకోవడం అదృష్టంగా ఉందని రామకోటి రామరాజు కృషి, పట్టుదల గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చీర్ హనుమాన్ దేవాలయ ప్రధాన అర్చకులు జనగామ చంద్రశేఖర్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *