బల్దియా పరిధిలోని 35వ డివిజన్ లోగల సాయి గణేష్ కాలనీ ప్రాంతాలలో మేయర్ ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఇంతకు ముందు కాలనీ లో పర్యటించే క్రమం లో తక్కువ పీడనం (ఫ్రెషర్)తో నీరు వస్తుందని మేయర్ దృష్టికి రాగ స్పందించిన మేయర్ అధికారులను. ఆదేశించి అక్కడ వాల్ప్స్ ఏర్పాటు చేసి పీడనం పెంచి నీటి సరఫరా సక్రమంగా కొనసాగేలాచర్యలు చేపట్టాలని ఆదేశించి పూర్తి చేసిన నేపథ్యం లో ఆదివారం క్షేత్ర స్థాయి లో అట్టి ప్రాంతం లో పర్యటించిన దరిమిలా స్థానికులను కలిసిన క్రమం లో తమ సమస్య పరిష్కారం పట్ల ప్రత్యేక చొరవ చూపిన మేయర్ కు మరియు కు అట్టి ప్రాంత వాసులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భం గా స్థానికం గా రోడ్డు వేయించాలని అక్కడి కాలనీ వాసులు మేయర్ ను కోరగా రోడ్డు ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మరియు నాలా ను పరిశీలించి అట్టి నాలా ను పూర్తి స్థాయి లో డి సిల్టింగ్ చేయించాలని ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులను ఆదేశించారు.
ఇట్టి కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, సి.ఎం.హెచ్.ఓ. డా. రాజేష్, డి. ఈ.రవికిరణ్, ఏ.ఈ.హబీబ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ రెడ్డి తో పాటు స్థానికులు పోలేపాక నరేందర్, సౌతాకారి నరేష్, వకోడే మధు, మచ్చ ప్రశాంతి, సంగోజు ఝాన్సీ, సింగసాని శరత్, పన్నీరు ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
