Breaking News

మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో వెంటనే నీళ్లు నింపాలి, రైతులను కాపాడాలి.

17 Views

గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన మహాధర్నా

రైతుల ప్రయోజనాల కోసం, రైతుల పంట పొలాలకు సాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగిస్తాం.

సాగునీరు మా హక్కు సాధించేదాకా పోరాటం చేస్తాం,

కాలేశ్వరంలో గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నా మొగులుకు ముఖం పెట్టే చూసే రోజులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చింది,

గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి

కాలేశ్వరం కన్నేపల్లి వద్ద బాహుబలి పంపులను వెంటనే స్టార్ట్ చేసి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ లాంటి రిజర్వాయర్లలో ప్రాజెక్టులలో గోదావరి జలాలను నింపి రిజర్వాయర్ల కింద కెనాల్స్, హల్దీ వాగు కుడవెళ్లివాగు, సంగారెడ్డి కెనాల్ రామారెడ్డి కెనాల్ కామారెడ్డి కెనాల్ బస్వాపూర్ కెనాల్ లోకి సాగునీరును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొండపోచమ్మ సాగర్ వద్ద రైతులతో కలిసి, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో నిరసన కార్యక్రమం, మహా ధర్నా నిర్వహించిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి

ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగాన్ని కాంగ్రెస్ అసమర్ధ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు,

ప్రతిరోజు లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్న రైతులకు సాగునీరు అందించకుండా నిర్లక్ష్యం చేస్తూ కాలేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ సుందిళ్ల అన్నారం బ్యారేజీ లోంచి ఎల్లంపల్లి గుడ్ మార్నింగ్ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు,

గతంలోని కేసీఆర్ ప్రభుత్వంలో జలకలతో కలకలాడిన రిజర్వాయర్లు నేడు నీటి కొరతతో ఎడారులుగా మారి వేలవేల బోతున్నాయని దీంతో యాసంగి వానకాలం పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు, త్రాగునీటి సమస్యలు కూడా రోజురోజుకు తీవ్రమవుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు, గతంలోని కేసీఆర్ ప్రభుత్వం రైతులకు శాశ్వత ప్రయోజనాల కోసం నిర్మించిన ప్రాజెక్టులను ప్రస్తుత అసమర్ధ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, రైతులు బతుకుతేనే రాష్ట్రం బతుకుతుంది కొండపోచమ్మ మల్లన్న సాగర్ నింపాలి రైతులను కాపాడాలి అన్నారు సాగునీరు మా హక్కు అని సాధించలేక పోరాటం ఆగదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు

గతంలోని కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పడుతున్న కష్టాన్ని చూసి, రైతులు కోటీశ్వరులు కావాలి, ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలని, ఎడారిగా ఉన్న తెలంగాణ భూములు పాడి పంటలతో పచ్చగా మారాలని గతంలోని కెసిఆర్ ప్రభుత్వం అనేక రకాల ప్రాజెక్టుల నిర్మాణం చేసి, మండుటెండల్లో సైతం సాగునీరు అందించి, రైతన్న గానికి అనేక రకాల రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు లాంటి అనేక రకాల రతకాలను రైతాంగానికి ఇచ్చి రైతులను రాజులుగా చేస్తే నేడు అబద్దాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి దుర్మార్గపు ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లను చేస్తుందని మండిపడ్డారు,

రైతుల పొలాల్లోకి రక్తం చల్లమని చెప్పడం చాలా దారుణం అన్నారు,

రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు ఎవరు భయపడరని, జంకరని, టిఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు పోరాటాలు కొత్తేమి కాదని అన్నారు

కాలేశ్వరం వద్ద కక్షతో బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి పిల్లర్లు కృంగినాయని పిట్టకథలు చెప్పి రైతులకు సాగునీరు అందించక, ప్రాజెక్టులను నింపక డైవర్ట్ రాజకీయాలతో కాలయాపన చేస్తూ రాజకీయాల లబ్ది పొందుతున్న అసమర్థ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు

కృంగిన రెండు పిల్లర్లను రిపేర్ చేయలేని అసమర్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు,

చేతగాని అసమర్ధ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుకోవాలని, బిఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ వద్ద కన్నేపల్లి బాహుబలి పంపులను స్టార్ట్ చేసి రైతాంగానికి సాగునీరు అందించి రైతుల పొలాలను సస్యశ్యామలం చేస్తామన్నారు,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన అందిస్తున్నారని, యావత్ తెలంగాణ ప్రజలు రైతాంగం ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను నిర్మాణం చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు,

వెంటనే కన్నేపల్లి పంపులను స్టార్ట్ చేసి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ లాంటి రిజర్వాయర్ల నింపి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనియ్యమని, ఎమ్మెల్యేల మంత్రుల పర్యటనలను రైతులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రైతులు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు తదితరులున్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *