*కంట్రోల్ రూం వచ్చిన వినతి అధికారుల తక్షణ స్పందన*
– *అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన పేషంట్,బంధువులు*
సింగారం గ్రామానికి చెందిన అఖిల
డెలివరీ కి సమయం పడుతుండడంతో వైద్యుల సలహా మేరకు కామాక్షి హాస్పిటల్ వచ్చింది. నిన్న రాత్రి నుండి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో హాస్పిటల్ చుట్టుపక్కల నీరు వచ్చి చేరింది.
ఊహించని ఈ పరిమాణంతో వైద్యులు అఖిల ను మరో ఆసుపత్రికైనా తరలించాలని , ఇంటికైన తీసుకెళ్లాలని వారి బంధువులకు చెప్పారు. చేసేది ఏమీ లేక పేషంట్ అఖిల కజిన్ బ్రదర్ నవీన్, బంధువులు అఖిల ను తన తల్లి గ్రామమైన జిల్లెళ్లకు కారులో తీసుకెళ్లారు. అశోక్ నగర్ కు రాగానే కారు నీటిలో చిక్కుకుపోయింది.
వెంటనే నవీన్ ( 9030273143 ) కలెక్టరేట్ లోని కంట్రోల్ రూం కు తమ కారు స్టక్ అయిందని సమాచారం ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు తక్షణమే అధికారులు అప్రమత్తం అయ్యారు. సిరిసిల్ల తహశీల్దార్ విజయ్ కుమార్ కారు చిక్కుకుపోయిన స్థలాన్ని చేరుకున్నారు. వారితో మాట్లాడారు.
పేషంట్ ను, ఆమె వెంట ఉన్న బంధువులను ప్రభుత్వ వాహనంలో జిల్లెళ్ళ కు తరలించారు.
కారు చిక్క కుపోయిన సమాచారం తెలిపిన వెంటనే స్పందించి ప్రభుత్వ వాహనంలో జిల్లెళ్ల తరలించిన అధికారులకు పేషంట్, వారి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.





