ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 29, మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో రేపు తెర్లుమద్ది గ్రామంలో ప్రచారం నిర్వహించే దిశగా మొదలు పెట్టనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పేద బడుగు బలహీన వర్గాలకు వెన్నంటూ ఉండి నిష్పక్షపాతిగా సేవలందించడంలో అందుబాటులో ఉంటున్న మంత్రి కేటీఆర్ ని అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 9,ఏళ్లపాలనలో అనేకమైన అభివృద్ధి పథకాలతో బంగారు తెలంగాణ దిశగా వెళ్తుండగా అలాగే ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పదంలోముందు ఉంచారని ఈవచ్చే ఎన్నికల్లో మన బిఆర్ఎస్ పార్టీ ప్రతిగడప గడపకు తీసుకొని బిఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించి కారుగుర్తుకు ఓట్లు వేసి గెలిపించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక మొత్తంలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేయాలని కోరారు.
