Breaking News ప్రాంతీయం

సండే రోజునా సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో బిజీ,బిజీ

107 Views

సెలవు దినం సండే రోజు కొనసాగిన సర్ (ఎస్ఐఆర్) కార్యక్రమం

గొల్లపల్లి గ్రామ పంచాయతీలో బీఎల్ఓ లు,వాలంటీర్ల తో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్

సెలవు దినం సైతం గ్రామాల్లో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్,ఆర్ఐ

రామగుండం నుండి గొల్లపల్లి కి వచ్చి తన ఓటు ను ఎన్రోల్మెంట్ చేసుకున్న (జవాన్) CISF, NTPC, ASI పిట్ల శంకర్.

Ts తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో సర్ (ఎస్ఐఆర్) కార్యక్రమం సెలవు దినమైన సండే రోజున కూడా కొనసాగింది.రాచర్ల గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ సెలవు దినం రోజున సర్ ఫారాలు నింపడం కోసం ఉద్యోగస్తులు,వ్యాపారస్తులు వచ్చే అవకాశం ఉంటుందని గమనించి బిఎల్ఓ,లతో పాటు తాను గ్రామపంచాయతీలో కూర్చొని సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయడానికి కృషి చేశారు.మండల రెవెన్యూ అధికారులు తహసిల్దార్ సుజాత,ఆర్ఐ సాహితి,మండల వ్యాప్తంగా సర్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పరిశీలిస్తూ బిఎల్ఓ లతో మాట్లాడుతూ ప్రక్రియలో వేగం పెంచాలని సూచించారు.

ఓటు మన హక్కు ప్రతి ఒక్కరూ త్వరగా ఎన్రోల్ చేసుకోవాలి: సిఐఎస్ఎఫ్,ఏఎస్ఐ పిట్లశంకర్

రాచర్ల గొల్లపల్లి వాస్తవ్యులు (జవాన్) పిట్ల శంకర్,సిఐఎస్ఎఫ్, ఎన్టిపిసి,ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నారు.సర్ ప్రక్రియలో భాగంగా తన ఓటును ఎన్రోల్మెంట్ చేసుకోవడం కోసం తాను సుమారు 110 కిలోమీటర్ల దూరం రెండు గంటల పదిహేను నిమిషాల ప్రయాణం చేసి గ్రామపంచాయతీకి వచ్చి సర్ ప్రక్రియను పూర్తిచేసుకుని తన ఓటును కాపాడుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఓటు అని ఎంత బిజీగా ఉన్నా ప్రజలు సర్ ప్రక్రియలో పాల్గొని ఆన్లైన్ చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెలవు దినం కావున అక్కడినుండి ఇక్కడికి సర్ ప్రక్రియలో భాగంగా రావడం జరిగిందని అధికారులు,బిఎల్ఓ లు అందుబాటులో ఉంటారో లేదోనని కంగారు పడ్డానని కానీ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ గ్రామపంచాయతీలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం,వాలంటీర్లను ఏర్పాటు చేయడం,బిఎల్ఓ లను ప్రోత్సహిస్తూ సెలవు దినం రోజున కూడా తను సైతం గ్రామపంచాయతీలో ఉండి సర్ ప్రక్రియను వేగవంతం చేయడానికి కృషి చేయడం సంతోషదాయకమన్నారు.

సర్ ప్రక్రియలో గ్రామం ముందుండాలి ప్రజలు సహకరించాలి:సర్పంచ్

సర్పంచ్ కొండా రమేష్ మాట్లాడుతూ
ప్రజలంతా తమ ఓటును పదిలంగా ఉంచుకోవాలని ఇప్పటివరకు ఎస్ఐఆర్ ఫారాలను అప్పగించని వారు త్వరగా పూరించి బిఎల్ఓ లకు అప్పగించాలని, పూరించడం తెలియని వారు గ్రామ పంచాయతీ వద్దకు వస్తే హెల్ప్ డెస్క్ వద్ద వాలంటీర్లు,వివిధ పార్టీల బీఎల్ఏ లు అందుబాటులో ఉండి ఫారాలను పూరిస్తారని కావున ప్రజలు వెంటనే తమ బిఎల్వోలు తమకు అందించిన ఫారాలను పూరించి మీ బిఎల్ఓ లకు అప్పగించాలని సర్పంచ్ కొండా రమేష్ గౌడ్ గ్రామస్తులను కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *