రామగుండం పోలీస్ కమిషనరేట్
ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నివారణకు జైపూర్ పోలీసుల ప్రత్యేక చర్య
రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్‌ఐ భూమేష్ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి వాహనదారులు, వ్యాపారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ భూమేష్ మాట్లాడుతూ,ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపివేయడం,టిఫిన్ బండ్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు.ఈ నేపథ్యంలో ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు.రహదారిపై టిఫిన్ బండ్లు లేదా ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకుండా సహకరించాలని, వాహనదారులు రహదారిపై వాహనాలను నిలిపివేయకుండా ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ప్రజల ప్రాణ భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్‌ఐ భూమేష్ హెచ్చరించారు.





