రాజకీయం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

33 Views

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

-రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపిన ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ నేతలు

TS తెలుగు 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేసిన ప్రభుత్వానికి ఎల్లారెడ్డిపేట మండల రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి, వారు చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాభేరా బేగం,మాజీ మండలాధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,జిల్లా నాయకులు,దత్తాత్రేయ గౌడ్,సాహెబ్,మర్రి శ్రీనివాసరెడ్డి,సీనియర్ నాయకులు పందిర్ల లింగంగౌడ్, చేపూరి రాజేశం,బండారి బాల్ రెడ్డి,జనార్ధన్,గుర్రాల రాజిరెడ్డి వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు,ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *