ముస్తాబాద్, జూలై 7 (24/7న్యూస్ ప్రతినిధి): రైతులకు నకిలీ
ఎరువులు అమ్మకుండా ఉండేందుకు ముస్తాబాద్ ఎస్సై జ్యోతి ఆధ్వర్యంలో గ్రామంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లోని ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు, లైసెన్సులు పరిశీలించారు. ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి అమ్మవద్దని వ్యాపారులకు సూచించారు. నకిలీ లేదా గడువు ముగిసిన ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై జ్యోతి హెచ్చరించారు. రైతులు బిల్లు తీసుకోవాలని, ఏమైనా అక్రమాలు గమనిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.




