
ఉచిత యోగ శిక్షణ తరగతులు ప్రారంభం
ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోవాలి: లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోయిని మహదేవ్
TS తెలుగు 24/7: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ ఎస్ పాఠశాల యందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యోగ శిక్షణా తరగతులు విజయవంతం గా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోయిని మహదేవ్,యోగా గురూజీ రంజిత్,లు మాట్లాడుతూ ఈ ఉచిత యోగ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యం కావున ఇట్టి యోగ శిక్షణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని సూచించారు. సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు ఇట్టి శిక్షణా తరగతులు నిర్వహించబడును అని తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా క్యాబినెట్ మెంబర్ సభ్యులు నంది కిషన్,ముత్యాల శ్రీనివాస్ రెడ్డి,జెడ్సి పయ్యావుల రామచంద్రం, మేగినరసయ్య,వెంకట్ రెడ్డి,నాగేందర్,సురేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,చురుకలు రిపోర్టర్ బండారి బాల్ రెడ్డి వి6 వెలుగు రిపోర్టర్ శ్యామంతుల అనిల్,మహిళా మణులు, గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





