ఎండోమెంట్ సెల్ కన్వీనర్ గా పసునూరి తిరుపతి.
మంచిర్యాల,జులై 6 కొమరం భీమ్ ఆసిఫాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం ఆధ్వర్యంలో పసునూరి తిరుపతి జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్ గా నియమించినందుకు జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం కి కృతజ్ఞతలు తెలుపుతూ తమకు కీలక బాధ్యతలు అప్పగించి పార్టీకి దేశానికి సేవ చేసే గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నూతన జిల్లా కన్వీనర్ పసునూరి తిరుపతి మాట్లాడుతూ రాష్ట్ర అగ్రనాయకత్వానికి ఎండోమెంట్ సెల్ రాష్ట్ర కన్వీనర్ అన్య ప్రజ్ఞుల సూర్య ప్రకాష్ కో కన్వీనర్ నిరంజన్ దేశాయ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ సేల్ జిల్లా కన్వీనర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రతిజ్ఞ చేశారు తెలంగాణలోని పురాతన దేవాలయాల సంప్రదాయాలను సంస్కృతిని కాపాడటం తో ఆలయ భూములు ఆస్తులు పరిరక్షణకు ఎండోమెంట్ సెల్ పూర్తిగా కట్టుబడి ఉంటుందన్నారు ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్విఘ్నంగా నిర్వహిస్తాం అహర్నిశలు శ్రమ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో కమలం గుర్తును విజయతీరాలకు చేర్చడానికి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడతామని తెలిపారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సమర్థవంతమైన నాయకత్వంలో రాబోయే 2028 ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయి జెండాను రెపరెపలాడించి తీరుతామని నూతన నాయకత్వం ఈ సందర్భంగా ధీమా వ్యక్తం ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకుడు తదితరు పాల్గొన్నారు.





