ప్రాంతీయం

తొలి విడుత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రత్యేక చర్యలు

54 Views

తొలి విడుత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రత్యేక చర్యలు

సిద్దిపేట జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7

బెజ్జంకి,చీలాపూర్ లో గృహప్రవేశాలకు హాజరైన ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి,ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టిందని మానకొండూర్ ఎమ్మెల్యే,టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంతో బండిపెల్లి రాజవ్వ-మల్లేశం, చీలాపూర్ గ్రామంలో కత్తి కనుకవ్వ-బాలయ్య గార్ల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉండగా, ఇప్పటికే కొన్ని లో కొన్ని స్లాబ్ వరకు రాగా మరికొన్ని వివిధ దశలలో ఉన్నాయని, ఉగాది నాటికి లక్ష ఇళ్లలో గృహప్రవేశాలు జరిపించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని, ఇంటి స్థలం లేని నిరుపేదలకు ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతుందన్నారు.అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి స్పష్టం చేశారు.అనంతరం

.70 మందికి చెక్కుల పంపిణీ.

బెజ్జంకి మండలానికి చెందిన 70 మందికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెక్కులు పంపిణీ చేశారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం వాటిని లబ్ధిదారులకు అందజేశారు. వీటిలో 41 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి 10 లక్షల 49వేల రూపాయలు మంజూరు కాగా, 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయల చొప్పున మంజూరు కాగా, వాటిని చెక్కుల రూపంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ బెజ్జంకి మండలానికి ఇప్పటి వరకు 23 విడుతల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయం నిరుపేదలకు ఆసరా కల్పిస్తుందన్నారు. కళ్యాణలక్షి,షాదీ ముబారక్ ల కింద ప్రభుత్వం అందించే సహాయం ఆడబిడ్డల తల్లిదండ్రులకు వరం లాంటిందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపి పారిశుద్ధ్యం, పిచ్చి మొక్కలు, వీధిలైట్లు,డ్రైనేజీ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని,సర్పంచులకు తెలుపుతూ, ప్రతి ఒక్కరూ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె.ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ శ్రీకాంత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మండల పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అక్కరవేణి పోచయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *