ప్రాంతీయం

5,లక్షల ఇన్సూరెన్స్ ఆటో యూనియన్ డ్రైవర్లుకు భరోసా కల్పించిన.కేకే

171 Views

ముస్తాబాద్, అక్టోబర్ 6, మండల కేంద్రంలొ టిఎస్ టిడిఎ రాష్ట్ర అధ్యక్షులు పింగళి సంపత్ రెడ్డి అధ్యక్షతన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఇన్స్యూరెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మనసున్న నాయకుడు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డీ తన సొంత డబ్బులతో ఆటో డ్రైవర్లకు 5లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డులు అందజేశారు. ఆటో యూనియన్ అధ్యక్షులు ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తూ ప్రజల క్షేమమే తన ద్యేయమంటూ ముందుకు వెళ్తున్న మహేందర్ రెడ్డిని ఆటో డ్రైవర్లు అభినందించారు. బిఆర్ఎస్ 9.ఏళ్ల పరిపాలనలో ఎన్ని అవినీతులు ఎన్ని అక్రమాలు ఎన్ని బీసీ బందులు ఎన్ని దళిత బంధువులు లెక్క చెప్పమనండి లెక్కచెప్తే కేవలం తన పార్టీలో ఉన్నవారికి అదికూడా ఊరికిద్దరికే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్లకె దళిత బంధని పేరుచెప్పి పేరుపెట్టి ఖాతాలో వేస్తామని చెప్పి ఎలక్షన్లలో ఓడిపోగానే అకౌంట్లు లాక్ చేపిస్తారు. దీనికి నిదర్శనం హుజురాబాద్ ఎలక్షన్లు కాదామేము అడుగుతున్నాం. బీసీలు కేవలం ఊరికి ఇద్దరే ఉన్నారా మిగతా వాళ్ళు ఏంపాపం చేశారని కేవలం ఇది కూడా నిదర్శనం చాలదా బిఆర్ఎస్ మోసపూరిత పథకాలు.. వారి కుటుంబ పాలన నిలిపివేయడానికి మీఓటు హక్కుపై ఆధారపడి ఉంది.  ఈఒక్కసారి కాంగ్రెస్ పరిపాలనకు ఒకే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఎంత దూరం తీసుకెళ్తామనేది ఆ 6 గ్యారంటీలతోపాటు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చే దిశగా వెళ్దామని కోరుతున్నాము. మిమ్మల్ని నమ్ముకున్న భార్య పిల్లలను ఆలోచించి ముందడుగు వేయండి ఇప్పటికే ఊరు ఊరికే కాకుండా వాడవాడకు ఒకటి రెండు బెల్ట్ షాపులు పెట్టి చాట్లతౌడు పోసి కుక్కలకొట్లాట పెట్టిన మాట వాస్తవం కాదా మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటికో బెల్ట్ షాపుకూడా పెట్టేతట్టు పర్మిషన్ ఇస్తారు. మనం చేసే కష్టార్జితమంతా మందులపాలు. మందులకు బానిసలుకాక భార్యల పుస్తెలు అమ్ముకోకండి రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ ముందుకొస్తే ఇకగడీల రాజ్యమే చూశారు. ఇప్పుడు పోలీసులతో హౌస్ అరెస్టులు, అర్థరాత్రి1,ఒంటిగంట సమయంలో దొంగనా పోలీసా దర్వాజా తట్టుడుకు అర్థంకాని పరిస్థితి ఇలాప్రతిపక్ష నాయకులను పట్టుకపోయి స్టేషన్ల బంధించుడు ఇది ఎంతవరకు సమంజసం ఇదికాదా బిఆర్ఎస్ అరాచకానికి నిదర్శనానికి నిలువెత్తు రూపం. అది ఇంతవరకే జరిగిందని ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడు బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇక జరగబోయేది చెవుల్లో రాళ్లు వేసి నలుపుకుంటూ గడిలలో బందీలుగా చేసి కిటికీలోనుంచి వారానికి ఒక్కసారి అన్నం విసిరేసే రోజులు వస్తాయని మరో ఆంగ్లేయుల సపరిపాలన సాగుతుందని మా కాంగ్రెస్ పార్టీ పదేపదే చెప్తుంది అప్పుడు విడిపించడానికి ఎవరు కూడారారు. అప్పటికి కూడా వారిదే ఫై చెయ్. వారు ఎలక్షన్ల ముందు ఇస్తాఅన్న హామీలు కేవలం మా ప్రతిపక్ష పార్టీ ఉన్నాదన్న భయంతో కొన్నే నెరవేర్చారు. ఇప్పుడు మాకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్లీ ఇంతగా ప్రచారంలోనికి రాలేము ఆలోచించి ఒక్కసారి మీ అమూల్యమైన ఓటు ఎటువేయాలో ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రాగానే మీరే గమనిస్తారన్నారు. ఈకార్యక్రమంలో టీఎస్ టిడిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె సుధాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు మెట్టు రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లాప్రధాన కార్యదర్శి కొండం రాజిరెడ్డి, సీనియర్ నాయకులు వేల్ముల రాం రెడ్డి, ఉచ్చిడి బాల్ రెడ్డి, వెంకట్రావుపల్లే గ్రామశాఖ అధ్యక్షులు కస్తూరి రాజిరెడ్డి, నక్క సురేష్, నక్క ప్రశాంత్ వేణుగోపాల్ రవి మరియు ఆటో యూనియన్ అధ్యక్షులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *