సిద్దిపేట జిల్లా జగదేవపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 1985 – 90 సంవత్సరంలో చదువుకున్న చిన్ననాటి మిత్రుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం గజ్వేల్ మండలం రిమ్మనగూడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు శశిధర్ శర్మ మాట్లాడుతూ దాదాపు మూడు దశాబ్దాల క్రితం చదువుకున్న మిత్రులం అందరం ఒక చోట కలుసుకుని కష్టసుఖాలు పంచుకున్నమని స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ స్నేహితుల దినోత్సవం రోజున అందరం కలుసుకోవడం సంతోషంగా ఉందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవితా రెడ్డి, వాణి రెడ్డి, పద్మ, మహిపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి,వెంకటేశం,రాజు,హరి ప్రసన్న రెడ్డి, రమేష్, అంజిరెడ్డి, కృష్ణ రెడ్డి, నరసింహా రెడ్డి, పద్మ, సాంబయ్య, మంజుల రెడ్డి, ఈశ్వరయ్య, మహిపాల్ రెడ్డి, కృష్ణ చారి, కాశీనాథ్, కొండల్, ఉమా రాణి, నర్సింలు, ఎల్లయ్య, భాగ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




