ముస్తాబాద్, మార్చి 20 జర్నలిస్టు కూర సంతోష్ సీనియర్ పాత్రికేయులు జన్మదిన వేడుకలు మండలంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొన్న అనంతరం సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజావారధిగా 30, యేండ్లుగా అనుభవజ్ఞులై జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో కొనసాగుతూ జర్నలిస్టు పదవిలో రాణించి గతంలో ఉత్తమ అవార్డు
పొంది సంతోష్ చేసిన సేవలను మరువలేనివన్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం కార్యాచరణ సాధనకోసం నిరంతరం జర్నలిస్టుల పక్షాన నిలబడి ప్రభుత్వ ద్వారా రావాల్సన నిధులు సాధిస్తారని ఉద్దేశ్యంతో భావించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి, నమస్తే తెలంగాణ బాలరాజు, చుంచు బాబు, కస్తూరి వెంకటరెడ్డి (ఆంధ్రప్రభ), రుద్రోజ్ శ్రీనివాస్, మేకర్తి శ్రీనివాస్, కొమ్ము బాబు తదితరులు పాల్గొన్నారు.




